Monday 8 September 2014

షారుఖ్‌ సరసన ఇలియానా?

ప్రస్తుతం సైఫ్‌ అలీఖాన్‌ జోడీగా ‘హ్యాపీ ఎండింగ్‌’ సినిమాలో నటిస్తున్న బక్కపలుచని భామ ఇలియానా తాజాగా ఓ జాక్‌పాట్‌ కొట్టినట్లు వినిపిస్తోంది. తన తదుపరి చిత్రంలో ఆమె ఏకంగా షారుఖ్‌ఖాన్‌ సరసన నటించే ఛాన్స్‌ పొందిందనేది తాజా ఖబర్‌. ఓవైపు ఫరాఖాన్‌ డైరెక్ట్‌ చేసిన ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న షారుఖ్‌ మరోవైపు యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ‘ఫ్యాన్‌’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. ఇందులో ఆయన జోడీగా పలువురి పేర్లు వినిపించగా, ఇలియానా ఆ పాత్రను దక్కించుకున్నట్లు సమాచారం. అదివరకు వాణీకపూర్‌, పరిణీతి చోప్రా పేర్లు కూడా ఈ పాత్రకు వినిపించాయి. తెలుగులో అగ్ర నాయికగా వెలుగొందుతున్న సమయంలోనే ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఇలియానా మొదటి చిత్రంతోటే ఆకట్టుకుంది. దాని తర్వాత ‘ఫటా పోస్టర్‌ నిక్లా హీరో’, ‘మై తేరా హీరో’ సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు రాజ్‌ అండ్‌ డీకే డైరెక్ట్‌ చేస్తోన్న ‘హ్యాపీ ఎండింగ్‌’లో నాయికగా నటిస్తోంది. కాగా ‘ఫ్యాన్‌’ను మనీశ్‌శర్మ రూపొందించనుండగా, హబీబ్‌ ఫైజల్‌ రచన చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తోంది.

0 comments:

Post a Comment