Wednesday 10 September 2014

‘వెంకీ’ కి గీతోపదేశం!

వెంకీ-పవన్ కలసి నటిస్తోన్న మల్టీస్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’. పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించినున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. పవన్ – వెంకీల మధ్య కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇవే చిత్రానికి ప్రాణం లాంటివని చిత్ర బృందం చెబుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వెంకీకి పవన్ గీతోపదేశం చేయనున్నాడన్న మాట. ఈ షెడ్యూల్ పవన్ షూటింగ్ అయిపోతుంది. వెంకటేష్ సరసన శ్రియ నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. కిషోర్ పార్దాసాని(డాలీ) దర్శకుడు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నట్టు.. గోపాల గోపాల.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

0 comments:

Post a Comment