Monday 8 September 2014

15న ‘గోవిందుడు అందరివాడేలే’పాటలు

రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. నిర్మాత మాట్లాడుతూ ‘‘లండన్‌లోని పలు సుందరమైన ప్రదేశాల్లో పాటలను చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 15న పాటలను, అక్టోబర్‌ 1న సినిమాను విడుదల చేస్తాం. సకుటుంబంగా చూసే అచ్చమైన తెలుగు చిత్రమవుతుంది. అమ్మలాంటి కమ్మనైన సినిమా మా ‘గోవిందుడు అందరివాడేలే’. ప్రతి ఫ్రేమూ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. శ్రీకాంత్‌, కాజల్‌ అగర్వాల్‌, ప్రకాష్‌రాజ్‌, కమలిని ముఖర్జీ, జయసుధ, ఎం.యస్‌.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, కాదంబరి కిరణ్‌, కాశీ విశ్వనాథ్‌, సమీర్‌ కారుమంచి రఘు, గిరిధర్‌, ప్రగతి, సత్యకృష్ణన్‌ కీలక పాత్రధారులు. ఈ సినిమాకు రచన: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: సమీర్‌ రెడ్డి, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఆర్ట్‌: అశోక్‌ కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, రామ్‌ లక్ష్మణ్‌, సమర్పణ: శివబాబు బండ్ల. ్త్ర ఓఠ్ధి

0 comments:

Post a Comment