Monday 8 September 2014

క్లైమాక్స్‌లో సూపర్ స్టార్ ‘లింగా’

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా, అనుష్క నాయికలు. ఈ సినిమా క్లైమాక్స్‌ చిత్రీకరణ కర్ణాటకలోని షిమోగలో ప్రస్తుతం జరుగుతోంది. లీ విట్టేకెర్‌ ఈ పతాక సన్నివేశాలకు స్టంట్స్‌ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ జరుగుతున్న విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న రజనీకాంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో పాటల్ని విడుదల చేయబోతున్నారు. అంతకన్నా ముందు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఐ’ సినిమా పాటల విడుదలకు ‘లింగా’ యూనిట్‌ హాజరు కానుందట. ‘లింగా’ సెట్స్‌కు వెళ్లి శంకర్‌ స్వయంగా రజనీకాంత్‌ను, కె.ఎస్‌.రవికుమార్‌ను ఆహ్వానించారట. అందువల్ల ఆ ఒక్క రోజు మాత్రమే ‘లింగా’ చిత్రీకరణకు బ్రేక్‌ ఉంటుందని సమాచారం.

0 comments:

Post a Comment