Thursday, 16 October 2014

లింగాలో త్రిష ఐటెంసాంగ్!

సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రత్యేకగీతాల్లో నర్తించని త్రిష తొలిసారిగా అందుకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే...రజనీకాంత్ కథానాయకుడిగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లింగా.

సోనాక్షిసిన్హా, అనుష్క కథానాయికలు. ఈ చిత్రంలో కథానుగుణంగా ఓ ప్రత్యేకగీతం వుందట. ఇందులో నర్తించే కథానాయిక కోసం పలువురు అగ్రనాయికలు పేర్లను పరిశీలించారు. చివరకు త్రిషను ఎంపికచేశారు. రజనీకాంత్ చిత్రం కావడంతో ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రత్యేక గీతాన్ని చేయడానికి త్రిష అంగీకరించిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. త్వరలో భారీస్థాయిలో ఈ స్పెషల్‌సాంగ్‌ను తెరకెక్కిస్తారని, సినిమాలో ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని అంటున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది.

0 comments:

Post a Comment