skip to main |
skip to sidebar

04:01

Unknown
No comments
అమీర్‌ఖాన్ హీరోగా
రాజ్‌కుమార్ హిరానీ పీకే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ మిస్టర్‌పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ గ్రహాంతర వాసిగా నటిస్తున్న ఈ
సినిమా తొలి మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. రైల్వే ట్రాక్‌పై
రేడియోను అడ్డుపెట్టుకుని నగ్నంగా అమీర్‌ఖాన్ కనిపించిన ఈ మోషన్ పోస్టర్‌పై
సర్వత్రా విమర్శలు వచ్చాయి. కొంత మంది ఈ పోస్టర్‌పై కోర్టు దాకా కూడా
వెళ్లిన విషయం తెలిసిందే. పెను వివాదాన్ని సృష్టించిన ఈ మోషన్ పోస్టర్
తరువాత అదే తరహాలో మరో మోషన్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు ఈ నెల 16న విడుదల
చేస్తున్నారు. పీకే చిత్రానికి సంబంధించిన ఇప్పటి వరకు మూడు ప్రచార
చిత్రాల్ని విడుదల చేశారు. ఇది నాలుగవది. ఇందులో అమీర్ తరహాలో హీరోయిన్
అనుష్కశర్మ కనిపించనుందని తెలిసింది. తొలి మోషన్ పోస్టర్‌ను మించి ఇది
మరింత ఆసక్తికరంగా వుంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పోస్టర్‌ను
వాట్స్‌అప్ ద్వారా వినూత్న పద్దతిలో విడుదల చేస్తుండటం విశేషం.
Posted in: Tollywood News
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment