Thursday, 16 October 2014

కలర్ స్వాతి కవిత

నటి స్వాతి ఆంగ్లంలో కవితలు రాసేస్తోందట. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇటీవల ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’.

 ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత చూస్తుంటే తనకు ఎదురైన అనుభవాలకు కవిత రూపం ఇచ్చినట్టు లేదూ! ఏమైతేనేం ఈ కవితను తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ స్వాతి అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. దీనికి అనూహ్య స్పందన వచ్చినట్లు కూడా ఈ అమ్మడు పేర్కొంది. ఇదంతా చూస్తుంటే స్వాతి త్వరలో గీత రచయిత అయిపోతుందేమోననిపిస్తోందా? అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. తెలుగులో నటించిన కార్తికేయ విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనుంది.

0 comments:

Post a Comment