Monday, 27 October 2014

బాక్సాఫీస్‌లో షారూఖ్‌ఖాన్ ‘హ్యాపీ’ పరుగు!

స్టార్ల స్టామినా తగ్గట్టుగానే వారి సినిమాలు కూడా బంపర్ బొనాంజాలవుతున్నాయి. పిక్చర్లు రిలీజయ్యి వారం తిరక్కుండానే వంద కోట్ల రూపాయల మార్కును చేరేస్తున్నాయి. అమ్మాయిల కలల రాకుమారుడు హృతిక్ రోషన్ ‘బ్యాంగ్ బ్యాంగ్’ ఐదు రోజుల్లోనే రూ.100 కోట్లను దాటితే...

తాజాగా రిలీజైన షారూఖ్‌ఖాన్ ‘హ్యాపీ న్యూ ఇయర్’ మరింత జోరుతో ఈ మార్కును చేరుకుంది. ఫరాఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే రూ.44.97 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇందులో అభిషేక్‌బచ్చన్, దీపికా పడుకొనే తదితర స్టార్లు నటించారు.
 

0 comments:

Post a Comment