డా.రాజశేఖర్ హీరోగా
రూపొందుతున్న సినిమా ‘గడ్డం గ్యాంగ్’. షీనా నాయిక. పి.సంతోష్ దర్శకత్వం
వహిస్తున్నారు. శివాని, శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితారాజశేఖర్
నిర్మిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ ‘‘తమిళంలో హిట్ అయిన ‘సూదు కవ్వుమ్’
సినిమాకు రీమేక్ ఇది. రాజశేఖర్ గడ్డందాస్‌గా నటిస్తున్నారు. ఇంతకు మునుపు
ఎప్పుడూ చేయని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఓ పాట మినహా షూటింగ్
పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అచ్చు మంచి
సంగీతాన్ని అందించడంతో పాటు ఓ పాత్రలో కూడా నటించారు. వచ్చే నెల్లో
పాటల్ని, సినిమాను విడుదల చేస్తాం. మాతృకను మించి తెలుగులో ఇంకా పెద్ద
విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.


22:06
Unknown

Posted in:
0 comments:
Post a Comment