Wednesday 8 October 2014

అనుష్కశర్మ కొత్త గెటప్

పొట్టి జుట్టు, రెయిన్‌కోట్‌తో భిన్నమైన వేషాధారణతో వున్న అనుష్క శర్మ ప్రచార చిత్రం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రంలో ఆమె లుక్, పాత్ర తీరుతెన్నులను దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఇందులో అనుష్క శర్మ పాత్రికేయురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో తెరకెక్కుతున్నతెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకులముందుకురానుంది. 

అమీర్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న పీకే చిత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా తాలూకు తొలి ప్రచార చిత్రంలో అమీర్‌ఖాన్ నగ్నంగా కనిపించడం అలాగే బ్యాండ్ వాయిద్యకారుడు, విచిత్రమైన పోలీస్ గెటప్‌లో విడుదల చేసిన మరో రెండు పబ్లిసిటీ స్టిల్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

0 comments:

Post a Comment