Wednesday 8 October 2014

నయన్‌ నమ్మకాన్ని నైట్‌ షో నిలబెడుతుందా?


అందాల నయనతార ఓ వైపు నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు గ్లామర్‌ని ఒలికించడానికి ఆస్కారం ఉన్న కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తోంది. శ్రీరామరాజ్యంలో మహాసాధ్వి సీతమ్మగా కనిపించి ఆకట్టుకుంది. కమ్ముల దర్శకత్వంలో అనామికగా వైవిధ్యం ఉన్న పాత్రలో నటించింది. ఆరంభం చిత్రంలో గ్లామర్‌ ఆవిష్కరించే పాత్రలో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కమర్షియల్‌ సినిమా కోసం రాత్రి వేళల్లో తెగ కష్టపడుతోందని సమాచారం. అశ్విన్‌ శరవనన్‌ దర్శకత్వం వహిస్తున్న నైట్‌ షో  చిత్రం కోసం రేయి వేళల్లో షూటింగుల్లో పాల్గొంటోంది. ఒళ్ళు హూనం అయినా ఫర్వాలేదు. రాత్రి అయినా ఫర్వాలేదు. ఆ క్యారెక్టర్‌ నచ్చింది. సినిమా కథ నచ్చింది. అందుకే నటిస్తున్నా. పారితోషికం కూడా తగ్గించుకున్నా అని నయన్‌ చెబుతోంది. ఈ సినిమా తప్పకుండా నాకు మంచి పేరు తీసుకువస్తుందని నమ్మకం ఉంది.. అని చెప్పింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి నయన్‌ నమ్మకాన్ని నైట్‌ షో నిలబెడుతుందా? వేచి చూడాల్సిందే.

0 comments:

Post a Comment