Wednesday 8 October 2014

నాగార్జున సెల్యులాయిడ్‌ సైంటిస్ట్‌






ఆధునిక సినిమాకి ట్రెండ్‌ సెట్టర్‌ శివ సినిమా. అప్పటివరకూ వెళ్తున్న ఓ మూస పద్ధతికి భిన్నంగా పరిశ్రమలో పెనుమార్పుని తీసుకువచ్చిన చిత్రం శివ. తన ఆలోచనని వేరెవరూ ప్రభావితం చేయకుండా.. పనిచేసిన ఘనుడు వర్మ. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తీశారు. అందుకే క్రెడిట్‌ వర్మదే. ట్రెండ్‌కి వ్యతిరేకంగా వున్నా సబ్జెక్టు కాబట్టి నిర్మాత మరింతగా నమ్మాలి. ఆ నమ్మకం రూపంలో ఆ రోజు వర్మకు సాక్షాతూ సెల్యు లాయిడ్‌ సైంటిస్ట్‌ నాగార్జున దొరికారు. నాగ్‌ నమ్మకం శివ సక్సెస్‌తో మరింత పెరిగింది. ఆ తర్వాత కూడా నాగ్‌ కొత్త దర్శకుల్ని అప్పటికి ఎందరినో పరిచయం చేసారు. తరువాత కూడా ఎంతో మందిని పరిచయం చేసారు. మున్ముందు కూడా ఇంకా పరిచయం చేస్తారు. నాగార్జున సినిమా సెట్‌లో బ్లాకు కాళ్ళ జోడు పెట్టుకుని కూర్చొని ఎవరిని పరిశీలిస్తున్నాడో మనకు కనపడదు. ఎవరికి ఏ టాలెంట్‌ వుందో గమనిస్తారు. గమనించి కొత్త వారికీ అవకాశం ఇచ్చేవారు. శివ టీమ్‌కి శుభాకాంక్షలు.

0 comments:

Post a Comment