కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో రజనీకాంత్
ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘లింగా’. సోనాక్షిసిన్హా, అనుష్క
నాయికలు. రాక్‌లైన్
వెంకటేష్ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ మంగళవారం నుంచి
హైదరాబాద్‌లో జరగనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో రజనీకాంత్,
సోనాక్షిసిన్హాపై ఓ పాటను చిత్రీకరిస్తారు. ఇప్పటికే టాకీ మొత్తం
పూర్తయింది. నెలాఖరున హాంకాంగ్, మెక్కా, ఫ్రాన్స్‌లో హీరో ఇంట్రడక్షన్
సాంగ్‌ను చిత్రీకరిస్తారు. దీంతో మొత్తం చిత్రీకరణ పూర్తయినట్టే.
త్రిష
స్పెషల్ సాంగ్ చేసిందని వినికిడి. రజనీకాంత్ పుట్టినరోజును
పురస్కరించుకుని డిసెంబర్ 12న సినిమాను విడుదల చేయనున్నారు.
ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలోని పాటలను నవంబర్‌లో
విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరుణాస్, సంతానం ఇతర ప్రధాన
పాత్రల్లో నటిస్తున్నారు. టాకీ పార్టును ఎక్కువగా కర్ణాటకలోనూ, రామోజీ
ఫిల్మ్‌సిటీలోనూ చిత్రీకరించారు.


20:26
Unknown

Posted in:
0 comments:
Post a Comment