Monday, 13 October 2014

‘ఐ’ కోసం రెండు రిలీజ్ డేట్స్ పరిశీలన?

ఈ సినిమాని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టెక్నికల్ గా సమస్య రావడం వలన సినిమాని రిలీజ్ ని వాయిదా వేసారు. సూపర్ సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఐ’. ఈ మూవీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచీ ఈ సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రిలీజ్ ఎప్పుడు ఉంటుందా అనే దానిపై క్లారిటీ లేదు.
తెలిసిన తాజా సమాచారం ప్రకారం ‘ఐ’ చిత్ర టీం టెక్నికల్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి నవంబర్ 21 లేదా నవంబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు డేట్స్ ని పరిశీలిస్తున్న టీం ఈ రెండింటిలో ఒక తేదీని త్వరలో లాక్ చేయనున్నారని సమాచారం. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించగా ఉపేన్ పటేల్ విలన్ గా కనిపించనున్నాడు.
శంకర్ ఇప్పటి వరకూ ట్రై చెయ్యని రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ ని ఈ సినిమాతో టచ్ చేయడం వలన ఈ సినిమాతో ఎలాంటి కొత్త పాయింట్ ని చెప్పనున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీకి పిసి శ్రీరాం సినిమాటోగ్రాఫర్.
 

0 comments:

Post a Comment