Monday, 13 October 2014

వాయిదా పడిన మనోజ్ ‘కరెంట్ తీగ’

మంచు మనోజ్ హీరోగా, మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన సినిమా ‘కరెంట్ తీగ’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న భారీగా రిలీజ్ కావడానికి సిద్దమైంది. కానీ హుదుద్ సైక్లోన్ రూపంలో సృష్టించిన ప్రళయం వలన కరెంట్ తీగ సినిమాని వాయిదా వేసారు. గత రెండు రోజులుగా కోస్తా ఆంధ్ర ప్రాంతాన్ని హుదుద్ సైక్లోన్ అతలాకుతలం చేసింది. ఈ రోజు ఉదయానికి ఆ సైక్లోన్ తీవ్రత కాస్త తగ్గింది. ఈ సైక్లోన్ వలన చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి.
ఈ కారణంగా ఈ చిత్ర టీం సినిమా రిలీజ్ ని వాయిదా వేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ చిత్ర టీం మొత్తం వైజాగ్ వెళ్లి ఆక్కడ తమకు చేతనైన సాయం చేయనున్నామని మనోజ్ తెలిపాడు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా సన్నీ లియోన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

0 comments:

Post a Comment