దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్లి వరుస సినిమాలతో
ఉత్తరాదికే అంకితమైంది ఇలియానా.ఎప్పుడు ఏదో ఒక మాట చెపుతూ వార్తల్లో నిలుస్తున్నది . దీపిక, సోనాక్షి, సోనమ్‌కపూర్ లాంటి
నాయికలకు ధీటుగా పోటీపడుతోంది. అయితే ఈ అమ్మడిపై రోజుకో రూమర్
పుట్టుకొస్తోంది. క్యూట్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం నడిపిస్తోందని,
పబ్బులు, పార్కులకు శికార్లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోందని రూమర్‌స
వినిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు ఈ విషయంపై ఎలాంటి స్పందన లేదు. కానీ
ఇప్పుడు పెదవి విప్పింది. ఆండ్రూ నాకంటే 15ఏళ్ల చిన్న పిల్లాడు. అతడితో
రొమాన్సా? నో ఛాన్‌స! అని చెబుతోంది. అయితే పబ్బులు, పార్కులు,
రెస్టారెంట్లకు కలిసి తిరుగుతున్న మాట వాస్తవమేనని చెప్పింది. ఆండ్రూ మంచి
పిల్లాడు. ఆడవాళ్లను గౌరవిస్తాడు. మా ఇద్దరి మధ్యా వేవ్ లెంగ్‌త బాగా
కుదిరింది. అందుకే అతడితో స్నేహం చేశాను. ఆండ్రూ నా బెస్‌ట ఫ్రెండ్ అంటూ
చెప్పుకొచ్చింది. తొందర్లోనే ఎవరో ఒకరిని పెళ్లాడేస్తా. ఆ రోజు అందరినీ
విందుకి పిలుస్తాలే! అంటూ ఊరించింది అమ్మడు. అయితే ఆండ్రూను పెళ్లాడుతుందా?
లేక వేరే ఎవరినైనా మనువాడుతుందా? అనే సంగతిని మాత్రం బైటికి చెప్పనేలేదు.
దాంతో ఈ జంట మధ్య ఏదో ఉందన్నది రూమర్ కాదని నమ్మాల్సొస్తోంది.


20:22
Unknown

Posted in:
0 comments:
Post a Comment