బాలకృష్ణ
కథానాయకుడిగా ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు ఓ చిత్రాన్ని
నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా సత్యదేవ దర్శకుడిగా
పరిచయమవుతున్నారు. చిత్రీకరణ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. యాక్షన్
ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గత కొన్ని నెలలుగా గాడ్సే
వారియర్ టైటిల్స్ అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం
ప్రకారం ఈ చిత్రానికి లయన్ అన్న పేరుని చిత్ర వర్గాలు ఖరారు చేయాలన్న
ఆలోచనతో వున్నట్టు విశ్వసనీయ సమాచారం. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ
చిత్రంలో ఆయన సరసన త్రిష నటించనుంది.
0 comments:
Post a Comment