త్రిష తమిళం నుంచి తెలుగుకి, ఇట్నుంచి కన్నడకి వెళ్లి దుమ్ము దులిపేసింది.
`దూకుడు' రీమేక్‌లో కన్నడనాట పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఇక్కడ
సమంత పోషించిన పాత్రను అక్కడ త్రిష పోషించి కన్నడిగుల అభిమానాన్ని
చూరగొంది. తెలుగు దూకుడు అంత పెద్ద విజయం సాధించింది. అయితే మరోసారి
రీమేక్‌కి ఓకే చెప్పింది. తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన
`అత్తారింటికి దారేది' రీమేక్‌లో ఐటెమ్నంబర్ చేయబోతోందంటూ ఇటీవలి కాలంలో
ప్రచారమైంది. ఇదే విషయాన్ని త్రిష తల్లి ఉమాకృష్ణన్ని ప్రశ్నిస్తే ..
అబ్బే అలాంటిదేం లేదు. ఇంతవరకూ మమ్మల్ని ఎవరూ సంప్రదించనేలేదని చెప్పారామె.
పరిశ్రమలో ముందస్తు ఊహాగానాలు సహజమే. ఒకవేళ త్రిష ఐటెమ్ నంబర్ చేస్తే
అది కచ్ఛితంగా ఆ సినిమాకి ప్లస్ అవుతుందే కానీ మైనస్ అవ్వదు. ఇక్కడ సమంత,
ప్రణీత పోషించిన పాత్రల్ని కన్నడలో రచిత రామ్, హరిప్రియ పోషిస్తున్నారు.
మరో కీలకపాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని ప్రచారమవుతోంది.
0 comments:
Post a Comment