ఇంతకాలంగా సెట్‌సకెళ్లకుండా గబ్బర్‌సింగ్ 2 వాయిదా పడడం రకరకాల సందేహాలకు
తావిస్తోంది. అంతేకాదు పవన్ స్వయంగానే గబ్బర్‌సింగ్ 2ని డైరెక్‌ట
చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో సంపత్‌నంది ఆలోచన మార్చుకుని రవితేజతో
పనిచేయాలని నిర్ణయించుకున్నాడని ప్రస్తుతం ఫిలింనగర్‌లో ప్రచారమవుతోంది.
అయితే ఇందులో నిజమెంతో తెలీదు కానీ.. నిజంగానే పవన్ తన సినిమాకి తానే
దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉన్న క్లిష్టమైన
పరిస్థితుల్లో అది సాధ్యమేనా? అని అంతా విశ్లేషణలు మొదలుపెట్టారు. అసలే
వెన్నునొప్పితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. దర్శకత్వం అంటే పెనుభారం. అన్ని
శాఖల్ని సమన్వయం చేయాలి. మరోవైపు రాజకీయంలో బోలెడు పనులుంటాయి. నిత్యం
బిజీ షెడ్యూళ్లతో క్షణం తీరికలేని పరిస్థితి ఉంటుంది. అదేగాక ఏపీలో
ప్రజలందరికీ బోలెడు సమస్యలున్నాయి. వాటన్నిటినీ వినేందుకు పవన్ చాలా
సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు
ఇప్పటినుంచే రేసులో ఉంటేనే పవన్ అనుకున్నది సాధించుకోగలడు.అందుకే ఇప్పుడు అందరి చూపు పవన్ పైనే.
0 comments:
Post a Comment