Thursday, 16 October 2014

ఆయనతో అవకాశం వస్తే వదులుకోలేను !


స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం సినిమాలో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? ఛాన్సే లేదు. అలాంటి అవకాశం రావడమే అరుదు. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో రేసులో వెనుకబడినా మణి సర్‌కి ఉన్న క్రేజు వేరు. అందుకే మణిరత్నం దర్శకత్వంలో సెట్‌‌సకెళ్లనున్న కొత్త సినిమాకి ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సంతకం చేసేసింది రింగుల జుత్తు సుందరి నిత్యామీనన్‌. నో చెప్పడానికి మనసెలా వస్తుంది. లెజెండరీ దర్శకుడాయన. అయితే కెరీర్‌లో ఇలా అవ్వాలి. అలా అవ్వాలి అని ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. అవకాశం వచ్చింది. నటిస్తున్నా. మణి సర్‌ దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇది ఆనందించదగ్గ విషయమే అని చెప్పింది. అయితే ఇప్పటికే నేను ఈ సినిమా కోసం సంతకం చేసి రెండు నెలలు పైగానే అవుతోంది. అయితే ఆ తర్వాత ఇంతవరకూ ఒక్కసారి కూడా మణిసర్‌తో మాట్లాడిందే లేదు. దాంతో వేరే నాయికను తీసుకున్నారు అన్న ప్రచారం సాగింది. ఏదేమైనా మేం కలిసి పనిచేస్తున్నాం.. అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా టాలీవుడ్‌లో ఓ మూడు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. లారెన్‌‌స దర్శకత్వంలో తాప్సీతో కలిసి గంగ చిత్రీకరణ ముగింపులో ఉంది. అలాగే క్రాంతి దర్శకత్వంలో శర్వానంద్‌ సరసన `మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రంలో నటిస్తోంది. గుణశేఖరుని దర్శకత్వంలో రుద్రమదేవి చిత్రంలో ఆడిపాడుతోంది. అదీ సంగతి.

0 comments:

Post a Comment