తెలుగు పోస్టర్ రేటింగ్ : 3/5
తండ్రిలాగానే రొమాంటిక్ లూక్స్ తో కనిపిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అన్న మాటని నిలబెడుతూ వస్తున్న అక్కినేని నాగ చైతన్య కూడా నాగార్జునలా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.అయితే తెలుగులో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కామన్ గా మారిపోయింది. నాగ చైతన్య నటించిన మరో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "ఒక లైలా కోసం" మూవీ కథ విషయానికి వస్తే...
కథ:
కార్తీక్ (నాగచైతన్య) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు పూర్తయిన తర్వాత పెద్ద కంపెనీల నుంచి ఉద్యోగాలను వచ్చిన ఆఫర్లను తిరస్కరించి.. ఓ ఏడాదిపాటు వరల్డ్ హాలీడే ట్రిప్‌కు కార్తీక్ వెళ్లాలనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ట్రిప్ చివర్లోనే తొలి చూపులోనే నందన(పూజా హెగ్డే)ను కార్తీక్ ప్రేమిస్తాడు. ఆ తర్వాత రోజూ తను ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు. అయితే చిన్న చిన్న కారణాల వలన కార్తీక్‌ను నందన ద్వేషిస్తుంది. ఒకరోజు ఎట్టకేలకు నందుని చూసిన కార్తీక్ తన ప్రేమని వ్యక్త పరుస్తాడు. కానీ నందు కార్తీక్ ని ద్వేషిస్తుంది.కాని నందన, కార్తీక్‌ల తల్లి తండ్రులు వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. తల్లితండ్రులను బాధపెట్టడం ఇష్టంలేని నందూ పెళ్లికి ఒప్పుకున్నప్పటికి.. కార్తీక్‌ను ద్వేషించడం మాత్రం మానదు. చివరికి కార్తీక్ ప్రేమకు నందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నందన మనసును కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు, కార్తీక్‌ను ద్వేషించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెరమీద చూడాల్సిందే.
రొమాంటిక్ సినిమాల ద్వారా రొమాంటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో మరింత అందంగా కనిపించాడు అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు.. ఎందుకంటే గత సినిమా కంటే ఈ సినిమాలో నాగ చైతన్య చాలా స్టైలిష్ లుక్ లో చాల అందంగా కనిపించాడు. ఇక ఈ సినిమా ఎలాగూ రొమాంటిక్ లవ్ స్టొరీ కావడం వలన తనదైన శైలిలో నటనని కనబరిచి ఆకట్టుకున్నాడు. కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు. ఇక ఈ సినిమాలో నాగ చైతన్య ఫైట్స్ తో పాటు సింపుల్ స్టెప్స్ కూడా వేసి కూడా ఆకట్టుకున్నాడు.
ఇక హీరోహిన్ పూజ హెగ్డే విషయానికి వస్తే ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా మొదటి సినిమాతోనే తన పెర్ఫార్మన్స్ తో అందరినీ మెప్పించింది. డైరెక్టర్ ఎంచుకున్న పాత్రకి పూజ హెగ్డే పూర్తి జస్టిఫికేషన్ చేసింది. సినిమా మొత్తం అటు ట్రెడిషనల్ గా, ఇటు గ్లామరస్ గా కనిపిస్తూ మెప్పించింది. ముఖ్యంగా పాటల్లో అందరినీ తనవైపు తిప్పుకుంది. కొన్ని ఎమోషనల్ మరియు సీరియన్స్ సీన్స్ లో చాలా బాగా చేసింది. ఇక ఈ సినిమాకి మరో మేజర్ హైలైట్ కాట్రవల్లి అలీ.. అలీ ఉన్న ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. అలీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరియు పోసాని కృష్ణ మురళి కాంబినేషన్ సీన్స్ మిమ్మల్ని తెగ నవ్విస్తాయి. ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పుకోవాల్సిన పేరు అలీ మాత్రమే.. నాగార్జున చెప్పినట్టు అలీ కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలైట్..
ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా, ఫాస్ట్ గా సాగడమే కాకుండా, కథలో ఉన్న ఓ రొమాంటిక్ ఫీల్ తో మీరు ట్రావెల్ అవుతూ ఉంటారు. ఆ ఫీల్ మీ పెదవులపై చిన్న చిరునవ్వుని తెప్పించడం వలన మీరు ఫస్ట్ హాఫ్ కి బాగా కనెక్ట్ అవుతారు. నాగ చైతన్య – పూజ హెగ్డే మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ ని కూడా డైరెక్టర్ చాలా బాగా డీల్ చేసాడు.
ఫస్ట్ హాఫ్ చాల బాగా వచ్చింది కాబట్టి తర్వాత ఆడియన్స్ అదే ఫీల్ ని సెకండాఫ్ లో ఆశిస్తారు.. ఆ ఫీల్ ని సెకండాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయారు అంతే కాకుండా సెకండాఫ్ బాగా స్లో అయిపోతుంది.. అలాగే ఫస్ట్ హాఫ్ లో కనిపించిన ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ లో మిస్ అవ్వడమే కాకుండా చాలా రొటీన్ సీన్స్ వస్తుంటాయి.ఇక అలాగే సినిమా మొత్తం హీరోయిన్ హీరోకి నువ్వు నాకు నచ్చలేదు అనడానికి సరైన కారణం చెప్పలేదు.
చివరగా ఒక మాట :
సెకండాఫ్ లో ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే రేంజ్ లో స్టొరీ లేకపోవడంతో కోద్ధిగా ఫెయిల్ అయ్యారు . లేదంటే నాగచైతన్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ రొమాంటిక్ స్టొరీ అయ్యేదే . ఈ కథలోని కొన్ని పాయింట్స్ యదావిధిగా ఇప్పుడొస్తున్న అన్ని తెలుగు సినేమాలలోగానే మనం ఎప్పుడో ఎక్కడో మూవీ లో ఇదివరకూ చూసామే అన్న ఫీలింగ్ ని కలుగజేస్తాయి.
రివ్యూ అనేది కేవలం అభిప్రాయం మాత్రమే కాబట్టి సినిమా చూసి ఎంజాయ్ చెయ్యండి


04:40
Unknown

Posted in:
0 comments:
Post a Comment