Thursday, 16 October 2014

రకూల్‌ప్రీత్‌ అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది

హైదరాబాద్‌ టు ముంబై, ముంబై టు సిమ్లా, సిమ్లా టు హైదరాబాద్‌ .. ఇంత బిజీగా తిరుగుతోంది అందాల రకూల్‌ప్రీత్‌. వెంకటాద్రి ఎక్‌‌సప్రెస్‌ ఇచ్చిన కిక్కుతో ఈ అమ్మడు వరుస కమిట్‌మెంట్లతో బిజీ అయిపోయింది. ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు తెలుగు సినిమాలతో బిజీ. మరోవైపు హిందీ సినిమాల హడావుడి. దీనికోసం హైదరాబాద్‌ నుంచి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్‌ పదే పదే తిరగాల్సొస్తోంది. మధ్యలోనే సిమ్లాలో హిందీ సినిమా షూటింగుకి వెళ్లింది. ఉదయం 5.30కే సిమ్లాలో షూటింగుకి హాజరైన ఈ అమ్మడు మళ్లీ ఆది సినిమా `రఫ్‌' ప్రమోషన్‌ కోసం సాయంత్రం 4.30కి హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్‌‌స చేసుకుని ఈ వివరాలన్నీ చెప్పింది. అంతేకాదు రఫ్‌ ఆడియో సక్సెస్‌ మీట్‌ తర్వాత మరో వేడుకకు కూడా హాజరయ్యానని చెప్పింది. త్వరలోనే కరెంటు తీగ రిలీజవుతోంది. ఆ ప్రమోషన్‌కి కూడా ఇలాగే హాజరవ్వాల్సి ఉంది. అదేగాక కిక్‌2 షూటింగ్‌లోనూ పాల్గొనాల్సి ఉంది. ఓవైపు షూటింగులు, మరోవైపు ప్రచారకార్యక్రమాలు అమ్మడిని ఊపిరి సలపనివ్వడం లేదు. అయితే ఇంతగా బిజీ అయిపోవడం చాలా ఆనందాన్నిస్తోందని ఉబ్బితబ్బిబ్బవుతోంది అమ్మడు. ఒక్క హిట్టు ఇచ్చిన కిక్కు ఇది.

0 comments:

Post a Comment