Thursday, 16 October 2014

కృతిసనన్ కొత్త సినిమాలు


కృతిసనన్ ప్రస్తుతం అక్షయ్‌కుమార్ హీరోగా ప్రభుదేవా రూపొందిస్తున్న సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో నటిస్తోంది. ఇంతకు ముందు ఈ చిత్రం కోసం సాల్సా నృత్యం నేర్చుకున్న ఈ సుందరి తాజాగా ఇదే సినిమా కోసం కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. పాత్ర డిమాండ్‌ని బట్టి చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో కృతిపై పోరాట ఘట్టాలు చిత్రీకరించాల్సి వుందని, అందులో భాగంగానే ప్రఖ్యాత కరాటే శిక్షకుడు మోహుల్ ఓరా దగ్గర కరాటేలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందని, ఆమెపై చిత్రీకరించే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కృతిసనన్ ఈ చిత్రంతో పాటు తెలుగులో నాగచైతన్య హీరోగా స్వామిరారా ఫేమ్ సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ, ప్రముఖ నవలా రచయిత చేతన్‌భగత్ తాజా నవల హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఆధారంగా రూపొందనున్న చిత్రంలోనూ నటిస్తోంది.

0 comments:

Post a Comment