Wednesday, 22 October 2014

పూజ సినిమా : రివ్యూ



తెలుగు పోస్టర్ రేటింగ్ : 3/5 

తమిళ్ హీరో అయిన విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే . మొదటి నుంచి ఎక్కువ యాక్షన్ మూవీస్  చేస్తూ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ నటించిన మరో మాస్ మూవీ  ‘పూజ’. గతం లో హరి దర్శకత్వంలో వహించి ‘యముడు’, ‘సింగం’ సినిమాలతో మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా పేర్చు తెచ్చుకున్నడు.  ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో సత్య రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. గతంలో విశాల్ – హరి కాంబినేషన్ లో వచ్చిన ‘భరణి’ సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా అదేలా హిట్ అవుతుందని విశాల్ ఆశిస్తున్నాడు. మరి విశాల్ అనుకున్నట్టు పూజ ఎ మేరకు హిట్ అవుతుందో చూద్దాం ... 

 

కథ :
చిన్నప్పుడే తన తల్లి తనను అపార్థం చేసుకోవడంతో బొబ్బిలి నుంచి పారిపోయి బీహార్ లో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ఒక చిన్న గ్రూప్ మైంతైన్ చేస్తున్న దివ్య(శృతి హాసన్) తో వాసు ప్రేమలో పడతాడు. మొదట శ్రుతి  తిరస్కరించిన వాసు గురించి నిజం తెలుసుకొని తను కూడా వాసును ప్రేమిస్తుంది . ఇదిలా ఉండగా వైజాగ్ కి వచ్చిన ఎస్.పి శివరాం నాయక్(సత్యరాజ్)ని సింగన్న చంపడానికి ప్లాన్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వాసు శివరాం నాయక్ ని కాపాడతాడు.
అదే సమయంలో ఓ కారణంగా సింగన్న బొబ్బిలి ప్రాంతానికి చెందిన జికె గ్రూప్కంపెనీ ఓనర్స్ అయిన రాధిక ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. ఎస్.పి శివరాం నాయక్(సత్యరాజ్) వాసుకు సపోర్ట్ ఇస్తాడు . తన ఫ్యామిలీ ఆపదలో ఉందని తెలియడంతో వాసు రంగంలోకి దిగుతాడు. అసలు సింగన్నకి – రాధిక ఫ్యామిలీకి ఉన్న వైరం ఏమిటి.? ఏ కారణం చేత సింగన్న వాసు ఫ్యామిలీని చంపాలనుకుంటాడు.? అసలు తనకంటూ ఓ ఫ్యామిలీ ఉన్నా వాసు వారందరికీ ఎందుకు దూరంగా ఉన్నాడు.? సింగన్నకి జయరాం విషయంలో తనకు కావాల్సింది మరియు జికె ఫ్యామిలీని కాపాడుతున్నది వాసు అని తెలియగానే ఏం చేసాడు? అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది ... 

ఇది ఒక మాస్ మూవీ దీనికి విశాల అతికినట్టు సరిపోయాడు ఇంతకు ముందు వచ్చిన పందెంకోడి భరణి లో లాగానే విశాల పెర్ఫార్మన్స్ సూపర్. కానీ కథ పూర్తిగా మస్ తో ఉండడం ఫ్యామిలీ ప్రేక్షకులకు అంతగా రుచించదు. విశాల ఆక్షన్  పెర్ఫార్మన్స్ మాత్రం దర్శకుడు చాలా బాగా చూపించాడు. విశాల బాగా కసితో ఈ సినిమా చేసినట్టు కనిపించాడు ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సినిమాలలో విశాళ్ కు పెద్ద హిట్ లేదు. దీపావళి సినిమాగా వచ్చింది అలాగే ఎ పెద్ద సినిమాలు కూడా పోటిలో లేవు కాబట్టి కమర్సియాల్ గా హిట్ కొట్టవచ్చు.

సినిమా ప్లస్ పాయింట్స్ :
విశాల్ నటన.
శృతి హాసన్ గ్లామర్ అట్రాక్షన్. 
సత్యరాజ్ పెర్ఫార్మన్స.
సెకండాఫ్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు.

సినిమా మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండాఫ్ పెద్ద మైనస్.
కామెడీ లేకపోవడం.
సినిమా కూడా బాగా లాంగ్ అవ్వడం.

చివరగా ఒక మాట దీపావళి సీజన్ కారణంగా మిగతా పెద్ద హీరోల సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఈ వీకెండ్ బాగా కాసులు కురిపించే అవకాశం ఉంది.  రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్స్ కోరుకునే మాస్ ఆడియన్స్ కి మాత్రం ఇది ఒక మాస్ మసాలా మూవీ ఫ్యామిలీ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చదు.

ఈ రివ్యూ కేవలం అభిప్రాయం మాత్రమే థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి

0 comments:

Post a Comment