Monday 13 October 2014

వంద లైలాల కోసం...


నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్న చిత్రం ఒక లైలా కోసం. విజయ్‌కుమార్ కొండా దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా వంద లైలాల కోసం నాగచైతన్య అనే కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇదే వేదికపై చిత్ర కథానాయిక పూజా హెగ్డే పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.

యూనిట్ సభ్యులమంతా ఎంత సంతోషంగా ఉన్నామో అంతే ఆనందంతో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ నెల 17న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఇక్కడికి వచ్చిన వంద మంది లైలాలకు అంకితం చేస్తున్నాను. ఇంత మంచి చిత్రాన్ని నాకిచ్చిన దర్శకుడు విజయ్‌కి, కెమెరామెన్ ఆండ్రూకి, డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌కి, మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కు థాంక్స్ అన్నారు. పూజా హెగ్డే మాట్లాడుతూ నేను ఎప్పటికీ మర్చిపోలేని పుట్టినరోజుఇది. వంద లైలాల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సరదాగా వుంది అన్నారు.

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ మంచి మ్యూజిక్ టేస్ట్ వున్న దర్శకుడు విజయ్‌కుమార్. సన్నివేశాల పరంగానూ, మేకింగ్ పరంగానూ ఆయనకు మంచి క్లారిటీ వుంది. అందుకే ఆయన చాలా స్పీడుగా చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన చేసిన గుండెజారి గల్లంతయ్యిందే ఎంత పెద్ద హిట్ అయిందో ఆ సినిమా తరహాలోనే ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలి అన్నారు.

0 comments:

Post a Comment