Monday 13 October 2014

స్కూలు పిల్లగా రకూల్‌...

మనోజ్‌ సరసన ఈ అమ్మడు నటించిన కరెంటు తీగ రిలీజ్‌ హుదూద్‌ ప్రభావం వల్ల వాయిదా పడింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ-కవిత అనే స్కూలు పిల్లగా సినిమాలో కనిపిస్తా. నాకు టీచర్‌గా సన్నీలియోన్‌ నటించారు. కవిత అమాయకురాలైన అమ్మాయి. జగపతిబాబు నా తండ్రి పాత్రలో కనిపిస్తారు. మనోజ్‌ నా లవర్‌ అన్నమాట! కరెంటు తీగ ఓ చక్కని రొమాంటిక్‌ కామెడీ. ఆద్యంతం కట్టిపడేస్తుంది. మోనోజ్‌ చూడటానికి మామూలుగా జోవియల్‌గా కనిపిస్తాడు.. కానీ ఆన్‌సెట్స్‌ చాలా సీరియస్‌గా ఉంటాడు.

నటనలోకి దిగితే ఎవరి మాటా వినడు. అంత సీరియస్‌గా పనిచేస్తాడు అని చెప్పింది. అలాగే తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నా. రామ్‌ సరసన పండుగ చేస్కో రవితేజ సరసన కిక్‌ 2 సినిమాల్లో నటిస్తున్నా. అలాగే బాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగు ఇంకా నేర్చుకోలేదు. భాష పెద్ద సమస్యగానే ఉంది. అయితే త్వరలోనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకునే స్థాయికి ఎదిగేస్తానని నమ్మకం ఉంది. అందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నా.. అని చెప్పింది.

0 comments:

Post a Comment