మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి,ప్రమోద్ తాజాగా గోపీచంద్
హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా
కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద
సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గత
చిత్రాలకు పూర్తి భిన్నంగా గోపీచంద్ ైస్టెలిష్ లుక్‌తో కనిపించబోతున్న ఈ
చిత్రానికి జిల్ అనే పేరుని పరిశీలిస్తున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. హీరో
గోపీచంద్ కూడా ఈ టైటిల్‌పై ఆసక్తిగా వున్నట్లు తెలిసింది. ఇందులో గోపీచంద్
పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, ఆయన కెరీర్‌లో వైవిధ్యమైన
చిత్రమవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కమర్షియల్ హంగులతో యాక్షన్
ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 70 శాతం చిత్రీకరణ
పూర్తిచేసుకుంది.


04:35
Unknown

Posted in:
0 comments:
Post a Comment