‘కార్తికేయ’ చిత్రం
దీపావళి సందర్భంగా ఈ నెల 24న విడుదల కానుంది. ఇటీవల ఏర్పాటు చేసిన
ప్రెస్‌మీట్‌లో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ విషయం వెల్లడించారు.
‘భగవంతుడు, సైన్స్ రెండింటిలో దేన్ని మనిషి నమ్మాలి అనే కాన్సెప్ట్‌తో ఈ
సినిమా రూపుదిద్దుకొంది. సినిమా బాగా రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు.
మా చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను’ అన్నారాయన. ఈ
కార్యక్రమంలో పాల్గొన్న నిఖిల్ మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో
దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన చిత్రం
ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ
చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది. నేను, స్వాతి నటించిన ‘స్వామి రారా’ 140
స్ర్కీన్స్‌లో విడుదలైంది. ఈ చిత్రం 250 స్ర్కీన్స్‌లో విడుదల కాబోతోంది.
ఒక్క నైజాం ఏరియాలోనే వంద థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది’ అని
తెలిపారు. హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పాత్ర పేరు వల్లి.
చాలా విభిన్నమైన పాత్ర. నేను ఎంజాయ్ చేస్తూ నటించాను’ అని చెప్పారు.
‘కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. విభిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం
అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు దర్శకుడు చందు మొండేటి.


04:39
Unknown
.jpg)
Posted in:
0 comments:
Post a Comment