Thursday, 16 October 2014

చివరకు వినాయక్‌తోనే అఖిల్‌ తెరంగేట్రం

వి.వి.వినాయక్‌ అఖిల్‌ తొలిచిత్ర దర్శకుడు. అఖిల్‌ తెరంగేట్రం ఖరారైనట్టే. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ని హీరోగా తెరకి పరిచయం చేసిన వినాయక్‌ అఖిల్‌ కోసం ఓ అద్భుతమైన సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటికే నిర్మాత నాగార్జున వినాయక్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయి కమర్షియల్‌ హంగులతో స్క్రిప్టును సానబడుతున్నారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారికి వార్త వెలువడనుంది. 1995లో సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా తెరకి పరిచయమైన అఖిల్‌ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైంది. ఓ ఆరంగేట్ర హీరోని అన్నిరకాల కమర్షియల్‌ హంగులున్న చిత్రంతో పరిచయం చేయడం తెలివైన నిర్ణయం అవుతుందని కింగ్‌ భావిస్తున్నారు. అందుకే వినాయక్‌ని ఫైనల్‌ చేశారని సమాచారం.

0 comments:

Post a Comment