Wednesday 24 September 2014

‘‘నేను ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖలో పేరు వేసుకుంటాను..

మారుతి టాకీస్‌, ఫుల్‌మూన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కాయ్‌ రాజా కాయ్‌’. బుధవారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న మారుతి ఉత్తినే పేరు వేసుకోను అని చెప్పుకొచ్చారు.‘నేను ఏ శాఖలో పనిచేస్తే ఆ శాఖలో పేరు వేసుకుంటాను. అంతేగానీ ఎవరో రాసుకున్న డైలాగులకు నా పేరు వేసుకోను. దాదాపు ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్‌ కాను. రాయకుండా రాశానని, తీయకుండా తీశానని నేను చెప్పను. హిట్‌ వచ్చినప్పుడు ఆయా శాఖల్లో నా పేరు వేసుకుంటాననే అపవాదు ఉంది. హిట్‌ అయిన తర్వాత నా పేరు వేసుకోవడం అంటూ ఉండదు. నేను పనిచేసినప్పుడే టైటిల్‌ కార్డు వేసుకుంటాను. హిట్‌ అయితే ఎవరికి వచ్చే క్రెడిట్‌ వాళ్లకి వస్తుంది’’ అని అంటున్నారు మారుతి. సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఈ నెల 28న ‘కాయ్‌ రాజా కాయ్‌’ ఆడియో, వచ్చేనెల సినిమాను విడుదల చేస్తాం. శివగణేష్‌ నా దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాడు. కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాడు’’ అని తెలిపారు. రియలిస్టిక్‌, రగ్గ్‌డ్‌ సినిమా అని, తాను బైక్‌ మెకానిక్‌గా నటిస్తున్నానని కన్నా అన్నారు. ట్విస్ట్‌లుండే సినిమా అని, ఆనంద్‌ అనే పాత్రలో నటిస్తున్నానని మానస్‌ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఆద్యంతం కొత్తగా ఉంటుంది. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ ఆడే ఓ కుర్రాడి గేమ్‌ వల్ల అతని స్నేహితులు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశారనేది ఆసక్తికరం’’ అని అన్నారు. పైశాచిక విలన్‌ పాత్రలో నటించినట్టు హరి తెలిపారు. రామ్‌ కన్నా, మానస్‌, జోష్‌ రవి, శ్రావ్య, షామిలి, హరి, డీఎంకే, రాఘవ, టార్జన్‌, రోజా తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు ఆర్ట్‌: కుమార్‌, సంగీతం: జె.బి., ఎడిటింగ్‌: ఉద్ధవ్‌.ఎస్‌.బి., కెమెరా: దేవ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: శ్రీనివాస్‌ అడ్డాల, రచన-దర్శకత్వం: శివ గణేష్‌.

0 comments:

Post a Comment