Wednesday 24 September 2014

బాలీవుడ్‌కు అనుష్క?

అనుష్క త్వరలో హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేయనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే...తెలుగువాడైన రచయిత, దర్శకుడు ఇ.నివాస్ (శూల్ ఫేమ్) హిందీలో జువనైల్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అనుష్క కథానాయికగా నటించనుందని తెలిసింది. వినూత్న కథాంశంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించనున్న ఈ చిత్ర కథ అనుష్కకు బాగా నచ్చిందని, దక్షిణాది చిత్రాల్ని పూర్తి చేసిన తర్వాత హిందీ చిత్రాన్ని చేయడానికి అమె సంసిద్ధత వ్యక్తం చేసిందని బాలీవుడ్ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనుష్క రుద్రమదేవి లింగా బాహుబలిలాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. ఈ సంవత్సరాంతానికి వాటి చిత్రీకరణ పూర్తవుతుందని, అనంతరం ఆమె హిందీ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. అనుష్క బాలీవుడ్ ఎంట్రీపై గత ఏడాదిగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. దక్షిణాదిలో బిజీగా వుండటం వల్ల గతంలో అనుష్క పలు బాలీవుడ్ ఆఫర్లను తిరస్కరించింది.

0 comments:

Post a Comment