Wednesday 24 September 2014

కమల్‌ పుట్టిన రోజున ‘ఉత్తమ విలన్‌’ విడుదల.....

 ‘ఉత్తమ విలన్‌’. ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.ఇందులో కమల్ తెయ్యమ్‌ కళాకారుడిగా, సినిమా నటుడిగా  రెండు పాత్రల్లో నటిస్తున్నారు  సినిమా లింగుస్వామి నిర్మిస్తున్నారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు. రమేష్‌ అరవింద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా ఇది. నవంబర్‌ 7న కమల్‌హాసన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఉత్తమ విలన్‌’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను కేరళలో శ్రీ కాళి ఈశ్వరి ఫిల్మ్స్‌ విడుదల చేస్తోంది. కమల్‌హాసన్‌ నటించిన ‘విశ్వరూపం-2’ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ‘పాపనాశనం’ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా మూడు సినిమాలకు సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండటంతో కమల్‌హాసన్‌ బిజీగా ఉన్నారు.

0 comments:

Post a Comment