Saturday 27 September 2014

విషాద ప్రేమకథలో నాయికగా దీపికాపదుకునే.....

క్యాన్సర్ వ్యాధితో బాధపడే యువతిని ఆమె తల్లిదండ్రులు ఓ పునరావాస కేంద్రంలో చేరుస్తారు. అక్కడ ఆమెకు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడైన యువకుడు పరిచయమవుతాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

ఆ తర్వాత ఏం జరిగిందన్నదే చిత్ర కథ. ఒరిజినల్ నవలలో నాయికానాయికలు 16 ఏళ్ల వయసున్న వారిగా కనిపిస్తారని, భారతీయ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశామని చిత్ర వర్గాలు వెల్లడించాయి. విషాదాంతమయ్యే ఈ ప్రేమకథలోని సన్నివేశాలు ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తాయని దర్శకుడు చెప్పారు. అనేక విజయవంతమైన ప్రేమకథా చిత్రాల్లో నటించిన దీపికాపదుకునే తొలిసారిగా ఓ విషాదప్రేమకథా చిత్రంలో నటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్రం తాలూకు ప్రచార చిత్రాన్ని ఇటీవలే విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.
అమెరికాలో అత్యధికంగా అమ్ముడయిన ది ఫాల్ట్స్ ఇన్ అవర్ స్టార్స్ (2012) నవల ఆధారంగా బాలీవుడ్‌లో ఈ  చిత్రం తెరకెక్కనుంది. వరుణ్‌ధావన్, దీపికా పదుకునే జంటగా నటించనున్న ఈ చిత్రానికి హోమీ అడజానియా (ఫైండిగ్ ఫన్నీ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు.

0 comments:

Post a Comment