Saturday 27 September 2014

హృతిక్ రోషన్‌తో కలిసి కత్రినా యాక్షన్ అవతార్....

అందానికే చిరునామా కత్రినాకైఫ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బాలీవుడ్ బ్యూటీనే అత్యంత గ్లామర్ హీరోయిన్ అంటూ పలు సర్వేలు వెల్లడించాయి. ఆ మధ్య వచ్చిన ధూమ్-3 చిత్రంలో అందాలారబోసి యువతను గిలిగింతలు పెట్టిన ఈ భామ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో అఖిలాంధ్ర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌తో కలిసి తెరపై దుమ్మురేపనుందట.

విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు అభినయం, అందం అంటూ అభిమానులను ఆనందడోళికల్లో ముంచెత్తిన ఈ క్రేజీ బ్యూటీ ఈ బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో కావలసినంత గ్లామర్‌ను గుప్పిస్తునే కొత్తగా యాక్షన్ అవతారమెత్తిందట. హృతిక్ రోషన్‌తో కలిసి పోరాటాలు చేసిందట. అంతేకాదు సాహసోపేతమైన ఛేజింగ్ సన్నివేశాల్లోనూ నటించిందట. విష యం ఏమిటంటే సముద్రంలో బాంబు బ్లాస్టింగ్‌ల మధ్య కత్రినాకైఫ్ ఫైట్స్ చేసిందట. ఇందుకు  శిక్షణ కూడా తీసుకుందట. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ రెండున తెరపైకి రానున్నట్టు సమాచారం.

0 comments:

Post a Comment