Sunday 14 September 2014

మనోహరుడు కాదు ఐ

దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. విక్రమ్, అమీజాక్సన్ జంటగా నటిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ దీపావళికి ప్రేక్షకులముందుకు రానుంది. తెలుగులో ఈ చిత్రానికి మనోహరుడు అనే టైటిల్ ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులోనూ ఈ సినిమాను ఐ పేరుతోనే విడుదల చేయబోతున్నామని నిర్మాత రవిచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు. ఆడియో నేడు చెన్నైలో విడుదలకాబోతుంది.

0 comments:

Post a Comment