Tuesday 2 September 2014

మహేష్ ఆగడు ప్రభంజనం మొదలయ్యింది....








 టైటిల్ కు తగ్గ పేరుతో వస్తున్నాడు మన టాలీవుడ్ అందగాడు మహేష్
మహేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఆగడు’. శ్రీను వైట్ల దర్శకుడు. గత శనివారం విడుదలైన ఆగడు ఆడియోకి విశేష స్పందన వస్తోంది. సెప్టెంబర్ 19న ‘ఆగడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. టాలీవుడ్ లో మహేష్ మానియా మొదలైంది. ఎక్కడ నలుగురు చేరిన ‘ఆగడు’పై ఆరా తీస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ‘ఆగడు’ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు సమాచారమ్. మహేష్ గత చిత్రాలు ఖలేజా, 1 నేనొక్కడినే, దూకుడు, సీతమ్మ వాకిట్లో.. , అక్కడ భారీ కలెక్షన్ ను సాధించాయి. అంతేకాదు.. 100 మంది విద్యార్ధుల కంటే ఎక్కువ మంది చదువుతున్న యూనివర్సిటీలలో స్పెషల్ గా షో వేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట. గోపి ఆచంట నిస్తున్నారు.

0 comments:

Post a Comment