Tuesday 2 September 2014

ఇకపై ఆంధ్రలో కరెంటు కోతలు ఉండవు

ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల విద్యుత్‌ను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో 10 వేల 361 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యముందని మంత్రి తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము చెప్పిన విద్యుత్ హామీ నెరవేరుస్తామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాపై ఈ నెల 10న ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. కాగా, అక్టోబర్ 2 నుంచి ఎపీలో 24 గంటల పాటు నిరంతర కరెంట్ ను అందించనున్నారు.

0 comments:

Post a Comment