అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ప్రభాస్, రానా, అనుష్క,
తమన్నా, రమ్యకృష్ణ తదితర భారీ తారాగణంతో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న
చిత్రం ఇది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఈ
చిత్రం కోసం 100 అడుగులు ఎత్తున్న ఓ భారీ విగ్రహాన్ని తయారు చేయించారు.
ఇప్పటివరకు భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంత భారీ విగ్రహం ఉన్న సినిమా లేదట. ఆ విధంగా ఈ చిత్రం ఓ రికార్డ్‌ని సొంతం చేసుకుంది. కళా దర్శకుడు సాబు శిరిల్ ఆధ్వర్యంలో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ విగ్రహాన్ని సాబు శిరిల్ అద్భుతంగా తయారు చేశారని, ఆయన పనితనం మెచ్చుకోదగ్గదని రాజమౌళి పేర్కొన్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలి భాగం విడుదలయ్యే అవకాశం ఉంది. కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

0 comments:
Post a Comment