Friday 26 September 2014

లౌక్యం సినిమా రివ్యూ

తెలుగు పోస్టర్ రేటింగ్ : 3/5

హీరో గోపీచంద్ మరోసారి శ్రీ వాస్ తో కలిసి చేసిన సినిమా ‘లౌక్యం’ఇంతకు ముందు ‘లక్ష్యం’ లాంటి సూపర్ హిట్ మూవీ అందించిన కాంబినేషన్ లో చేసాడు. ఈ సినిమాకి శ్రీధర్ సీపాన కథ – మాటలు అందించాడు.
యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ మిక్స్ చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘సాహసం’ సినిమా తర్వాత కమర్షియల్ సక్సెస్ కోసం గోపీచంద్ చేసిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎలా ఉందొ చూద్దాం .....
కథ :
వెంకటేశ్వర్లు (గోపీచంద్) తన ఫ్రెండ్ ప్రేమ కోసం వరంగల్ లో దాదా అయిన బాబ్జీ(సంపత్) చెల్లెల్ని కిడ్నాప్ చేసి పెళ్లి చేస్తాడు. దాంతో బాబ్జీ నుంచి తప్పించుకోవడానికి వెంకీ హైదరాబాద్ వెళ్తాడు. అక్కడ చంద్రకళ (రకుల్ ప్రీత్ సింగ్) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకీ చంద్రకళ కూడా వెంకీ ని ప్రేమిస్తుంది.
సిటీలో డాన్ అయిన సత్య (రాహుల్ దేవ్) చెల్లెలే చంద్రకళ. వెంకీ – చంద్రకళల ప్రేమ గురించి తెలుసుకున్న సత్య వెంకీని చంపేయమంటాడు. అదే సమయంలో కేశవ్ రెడ్డి (ముఖేష్ ఋషి) చంద్రకళని చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే కథలో అసలు ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? అసలు కేశవ్ రెడ్డి ఎవరు? చంద్రకళని ఎందుకు చంపాలనుకున్నాడు? బాబ్జీకి సత్య కి ఏమన్నా సంబంధం ఉందా? వీరందరి నుంచి వెంకీ ఎలా తప్పించుకొని చంద్రకళని ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది సినిమా చూడాలి….

గోపీచంద్ చాలా రోజుల తర్వాత మరోసారి జోష్ ఉన్న పాత్రలో కనిపించాడు. ‘రణం’ సినిమా తర్వాత కామెడీ, యాక్షన్ కలిపి చేసిన పాత్ర ఇది. రణం లోలానే గోపీచంద్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా ఈ పాత్రని చేసాడు. తనే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలబడి కథని ముందుకు నడిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేసాడు,రకుల్ ప్రీత్ సినిమా మొదటి నుంచి మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తూ తన గ్లామరస్ డోస్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించింది. గోపీచంద్ – రాకుల్ ప్రీత్ కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. 
ఈ సినిమాకి ముఖ్యమైన మరో మెయిన్ విషయం మన కామెడీ కింగ్ బ్రహ్మానందం, బాయిలింగ్ స్టార్ బబ్లూగా కనిపించిన పృధ్వీ(30 ఇయర్స్ ఇండస్ట్రీ), చంద్రమోహన్. బాయిలింగ్ స్టార్ గా పృథ్వి వచ్చే నాలుగైదు సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి.సెకండాఫ్ లో గోపీచంద్ – బ్రహ్మానందం – చంద్ర మోహన్ కాంబినేషన్ సీన్స్ ప్రేక్షకులను బాగానే నవ్విస్తాయి.
ఇక ఈ సినిమాలో ఉన్న మరో స్పెషల్ అట్రాక్షన్ హంసా నందిని.. తను కేవలం ఒక పాటకి మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సీన్స్ లో కూడా కనిపించి గ్లామర్ తో ఆకట్టుకుంది. సంపత్, రాహుల్ దేవ్, ముఖేష్ రుషి, రఘుబాబు తదితరులు తమ పాత్రలకి న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మరియు ఇంటర్వల్ ట్విస్ట్ బాగుంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ సినిమాకి చాలా హెల్ప్ అవుతాయి.

కథ యాజిటీజ్ గా ఉంది.. దేనికి యాజిటీజ్ అంటే
డీ, రెడీ, కందిరీగ, దూకుడు, రభస, ఆగడు ఇప్పుడు లౌక్యం.. కథల్లో బ్యాక్ డ్రాప్ లు మారిన కథలో మాత్రం పెద్ద తేడా ఉండదు. కావున ఈపాటికే మీకు కథ ఎలా ఉంటది అనేది క్లారిటీ వచ్చేసి ఉంటుంది.

 కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి స్క్రీన్ ప్లే రాసారు.. వారిద్దరే ఇప్పటికి చాలా సినిమాలకు ఇలాంటి కథ – స్క్రీన్ ప్లే రాసారు. సో వాళ్ళు అదే పాత సినిమాల స్క్రీన్ ప్లే దీనికి ఇచ్చారు. దాంతో సినిమా ఊహాజనితంగా మారింది,కనల్ కన్నణ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ఇంకాస్త బెటర్ గా ప్లాన్ చేసుకోవాల్సింది.

గోపీచంద్ ‘సాహసం’ తర్వాత సంవత్సరంకి పైగా తీసుకొని చేసిన రెగ్యులర్ అండ్ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ‘లౌక్యం’ ప్రేక్షకులను నవ్వించడంలో బాగా సక్సెస్ అయ్యింది. రొటీన్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.  ప్రస్తుతం బాక్స్ ఆఫీసు వద్ద కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు వేరే ఏమీ లేనందు వల్ల ఈ సినిమా బాగానే ఆడే ఆవకాశం ఉంది. పర్ఫెక్ట్ గా సినిమాని ప్రమోట్ చేసుకుంటే గోపీచంద్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కూడా నిలిచే అవకాశం ఉంది.
తెలుగు పోస్టర్ రేటింగ్ : 3/5
ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి రివ్యూ కేవలం మా అభిప్రాయం మాత్రమే.

0 comments:

Post a Comment