35ఏళ్లుగా సినీరంగానికే అంకితమై కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్ని
నవ్విస్తూ ఆహ్లదాన్ని పంచుతున్న నవ్వుల రేడు బ్రహ్మానందం అరుదైన రికార్డును
సొంతం చేసుకోబోతున్నారు. అతడు 1000సినిమాలు పూర్తి చేయడానికి ఇంకా మూడు
సినిమాల దూరంలోనే ఉన్నాడు. నిన్నటి లౌక్యం ప్లాటినం డిస్‌క వేడుకలో ఆ
విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఒకవేళ ఈ రికార్డును చేరువైతే ప్రపంచంలోనే
అత్యధిక సినిమాల్లో నటించిన ఏకైక కమెడియన్‌గా గిన్నిస్ రికార్డును
అధిరోహించినట్టే. ప్రపంచంలో వేరే ఏ హాస్యనటుడికి బ్రహ్మీకి వచ్చినన్ని
అవకాశాలే రాలేదంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్‌లో ఏ నటుడికైనా కెరీర్ మహా
అయితే పదేళ్లు మించి ఉండదు. బాలీవుడ్‌లోనూ హాస్యనటులకు మైలేజ్ చాలా
తక్కువ. ఒక్క తెలుగు సినీపరిశ్రమలోనే ఇంతటి ఆదరణ. నచ్చితే
నెత్తికెక్కించుకునే స్వభావం ఒక్క తెలుగు ఆడియెన్‌కి మాత్రమే ఉంది అనడానికి
బ్రహ్మీ కెరీర్ ఓ ఉదాహరణ. ఆ మూడు సినిమాలు పూర్తయితే తెలుగు చలనచిత్ర
పరిశ్రమ ఘనంగా సన్మానించి అతడిని గౌరవించాల్సిన సందర్భం వచ్చింది. ఓ
తెలుగువాడు సాధించిన ఘనచరితగా ఈ రికార్డును పరిగణించాలి.
0 comments:
Post a Comment