రెజీనా టైమ్ స్టార్టయ్యిందా? అంటే అవుననే సమాచారం. ఈ అమ్మడికి మెగా
ఫ్యామిలీ స్టార్ హీరోల నుంచి గుర్తింపు దక్కింది. చరణ్, బన్ని సరసన
నటించడానికి ఇంకెంతో టైమ్ పట్టదని క్లోజ్ సోర్సెస్ చెబుతున్నాయి.
ఎస్‌ఎంఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ కోలమొహం, ఆకట్టుకునే
కళ్లు, కొంటె చూపులు ఈ అమ్మడికి పెద్ద ప్లస్. అందుకే తొలిసినిమాతోనే విజయం
అందుకుని, వెంటనే సందీప్‌కిషన్ `రొటీన్ లవ్‌స్టోరి'లో నటించి
ద్వితీయప్రయత్నం పర్వాలేదనిపించింది. అటుపై మెగా హీరోలు సాయిధరమ్‌తేజ్,
అల్లు శిరీష్ ఇద్దరి సరసన నటించింది. అల్లు శిరీష్ సరసన నటించిన
`కొత్తజంట' బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. అదేగాక నారా రోహిత్
సరసన శంకర, సందీప్ కిషన్‌కు జోడీగా `రారా కృష్ణయ్య' సినిమాలలో నటించింది.
సాయిధరమ్ తేజ్ సరసన `పిల్లా నువ్వు లేని జీవితం' త్వరలో రిలీజ్‌కి రెడీ
అవుతోంది. అయితే వీటన్నిటికంటే ముందే రవితేజ సరసన నటించిన `పవర్' రిలీజై
అమ్మడికి పెద్ద బ్రేక్ వచ్చింది. ఇకనుంచి మాస్‌లో ఇమేజ్ ఉన్న ఎలాంటి
పెద్ద హీరో సరసన అయినా రెజీనా సరిపోతుందని నిరూపించుకున్నట్టే. ప్రస్తుతం
చరణ్, బన్ని, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల సినిమల్లో రెజీనాకు
ఛాన్సుందని తెలుస్తోంది.
0 comments:
Post a Comment