Thursday 25 September 2014

వచ్చే నెలలో ఒక లైలా కోసం విడుదల

వచ్చే నెలలో ఒక లైలా కోసం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సున్నితమైన భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. ప్రేమికుల మధ్య గిల్లికజ్జాలు, చిలిపి సరదాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. నాగచైతన్య పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది అని తెలిపారు. 




ఇక సినిమా కథ విషయానికి వస్తే మనసుపడ్డ చిన్నదాని ప్రేమను గెలుచుకోవడానికి ఓ యువకుడు ఏం చేశాడు? సాఫీగా సాగిపోతున్న వారి ప్రేమాయణంలో వచ్చిన అనుకోని మనస్పర్థలు ఏమిటి? చివరకు ప్రేమజంట వాటన్నింటినీ అధిగమించిన తమ ప్రేమను ఎలా సాఫల్యం చేసుకున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఒక లైలా కోసం చిత్రం చూడాల్సిందే అన్నారు విజయ్‌కుమార్ కొండా. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడియో పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది.
బ్రహ్మానందం, అలీ, నాజర్, ప్రభు, ఆశిష్ విద్యార్థి, ప్రగతి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.

0 comments:

Post a Comment