Friday 26 September 2014

‘లింగా’ వచ్చేదాకా ఆగాల్సిందే.

పెద్ద వయసు హీరోలతో చేయడానికి సాధారణంగా మన కథానాయికలు ఆసక్తి చూపరు. కానీ... సూపర్‌స్టార్ రజనీకాంత్ విషయంలో మాత్రం అది మినహాయింపే. ఆయనకు జోడీగా నటించడమంటే కథానాయికలకు అదో పెద్ద ఘనకార్యం కింద లెక్క. అలా కోరుకునే కథానాయికల జాబితాలో త్రిష కూడా ఉన్నారు. రజనీకాంత్‌తో నటించాలనే కోరికను పలు సందర్భాల్లో ఆమె వ్యక్తం చేశారు కూడా. కానీ... ఆ కోరిక మాత్రం ఆమెకు అందనంత దూరంలో ఉండిపోయింది. అయితే... తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే... ‘లింగా’లో ఆమె రజనీకాంత్‌తో ఐటమ్‌సాంగ్ చేశారట.

ఇప్పటికే పాట చిత్రీకరణ కూడా పూర్తయిందట. పలు వెబ్‌సైట్స్‌లో ఈ వార్త హల్‌చల్ చేస్తోంది. అయితే.. ఇదే విషయంపై గత నెలలో త్రిష వివరణ ఇస్తూ- ‘‘సూపర్‌స్టార్‌తో నర్తించడమంటే... నిజంగా అదృష్టమే. అయితే... అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు. నేను ‘లింగా’లో ఐటమ్ సాంగ్ చేస్తున్నానని వస్తున్న వార్త ఇప్పటికైతే కరెక్ట్ కాదు’’ అని చెప్పారు. మరి ఈ రెండిట్లో నిజమేది? సూపర్‌స్టార్‌తో త్రిష అడుగు కదిపారా, లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే... ‘లింగా’ వచ్చేదాకా ఆగాల్సిందే.

0 comments:

Post a Comment