Friday 26 September 2014

మనోజ్ ‘దేవదాస్ బ్రేకప్’ సాంగ్.

మనోజ్ ‘ప్యార్‌మే పడిపోయానే...’ అంటూ ‘పోటుగాడు’లోని తన ప్రేమ కథను యువతరానికి వినిపించారు. ఇప్పుడేమో ‘కరెంట్ తీగ’ కోసం ‘దేవదాస్ బ్రేకప్’ అంటూ భగ్న ప్రేమకథని పాటగా అందుకున్నారు. అప్పుడు అదీ హిట్టే. ఇప్పుడు ఇదీ హిట్టే. యువ శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటోందట మనోజ్ ‘దేవదాస్ బ్రేకప్’ సాంగ్.

ఇక ‘కరెంట్ తీగ’ విషయానికొస్తే...‘కరెంట్ తీగ’ లాంటి కుర్రాడి జీవితంలోకి మెరుపులాంటి ఓ చిన్నది వస్తే ఏం జరుగుతుంది? అనేది ఈ సినిమా. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రధారి. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అచ్చు స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మనోజ్ పాడిన ‘దేవదాస్ బ్రేకప్..’ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఇక, సన్నీ లీయోన్ చేసిన పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మనోజ్ నటన, తను చేసిన డేర్ డెవిల్ ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని వర్గాలవారూ చూడదగ్గ విధంగా ఉంటుంది’’ అని చెప్పారు.

0 comments:

Post a Comment