Saturday 6 September 2014

‘కోటి’స్తే కాజల్ రెడీ..

ఈమద్య మన తెలుగు సినిమా హీరోయిన్స్ ఎంత పని చేయడాకైనా.. వెనకడుగు వెయ్యడం లేదు. డబ్బు కోసం చిన్నా.. పెద్ద హీరోలని కూడా చూడకుండా తమ డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఈ మధ్య సమంత బెల్లం కొండా సురేష్ కొడుకు ‘బెల్లం కొండ శ్రీనివాస్’ సరసన నటించి అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక, తమన్నా అయితే.. ఓ అడుగు ముందుకేసి.. మరీ ఐటెంసాంగ్ లో అందాలు ఆరబోసింది. ఈ హీరోయిన్స్ అంతా ఇండస్ట్రీలో డిమాండ్ లేక ఇలాంటి పాత్రలు చెయ్యడం లేదట.. కేవలం డబ్బు కోసం ఎంతటికైనా సిద్ధమంటున్నారట. తాజాగా, కాజల్ కోటిస్తే దేనికైనా రెడీ అందట. ఏ చిన్న హీరో కూడా కాదు.. ఏకంగా.. ఎన్టీఆర్ సినిమాకు కోటిన్నరకు డిమాండ్ చేసినట్ట్లు టాలీవుడ్ సమాచారమ్. మొదట ఎన్టీఆర్ చిత్రంలో నటించమని పూరీ అడిగితే.. డేట్స్ ఖాళీ లేవని తెగేసి చెప్పిందట. తరవాత నిర్మాత బండ్ల గణేష్ మణితో మస్మరైజ్ చేశాడట. కోటిన్నర కట్టబెడతా రమ్మంటే.. సై అందట కాజల్. ఇవ్వన్నీ.. చూసిన సినీ అబిమానులు డబ్బు కోసం మన హీరోయిన్స్ ఎలాంటి పని చేయడానికైనా.. వెనుకుడుగు వేయరని ముక్కున వేలేసుకుంటున్నారు..

0 comments:

Post a Comment