Saturday 6 September 2014

కావలసిన పథకాలు ప్రధాని ముందుపెట్టిన కెసిఆర్

తెలంగాణ రాష్ట్రానికి కావలసిన ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ ముందు పెట్టారు. ప్రధానితో సమావేశం ముగిసిన తరువాత కెసిఆర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేకహోదా కల్పించాలని ప్రధానికి  విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ప్రపంచ మేయర్ల సదస్సుకు హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించినట్లు తెలిపారు.  ప్రధాని మోడీ ముందు 21 ప్రతిపాదనలు ఉంచినట్లు వివరించారు. తెలుగు ప్రజలు సఖ్యతగా ఉండాలని  ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో తానే చర్చలకు చొరవ చూపానని ప్రధాని మోడీకి ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు.

కెసిఆర్ ప్రధానిని కోరిన ముఖ్యమైన పథకాలు:

1. తెలంగాణలో విద్యుత్‌ కొరతను పరిష్కరించాలి.
2. వెయ్యి మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు.
3.  ప్రత్యేక హైకోర్టు కావాలి.
4.  బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు.
5. హైదరాబాద్-వరంగల్‌-నాగ్‌పూర్‌ ఇండస్ట్రియల్ కారిడార్‌.
6. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.
7. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలి.
8. కాజీపేటలో రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు
9. నార్త్‌ తెలంగాణలో నాలుగు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు మంజూరు చేయాలి.

ఎన్ టిపిసి విద్యుత్ ప్రాజెక్టు, బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌, హార్టికల్చర్‌ యూనివర్శటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు కెసిఆర్ తెలిపారు. 

 సమగ్ర సర్వే గురించి ప్రధానికి వివరించాం

 సమగ్ర సర్వే గురించి ప్రధానికి వివరించినట్లు ఎంపీ వినోద్ తెలిపారు. ప్రస్తుత డేటాతో అక్రమాలు జరుగుతున్నాయని,  అందుకే సర్వే చేపట్టామని ప్రధానికి తెలిపినట్లు వివరించారు. సర్వే వివరాలను కేంద్రానికి పంపాలని మోడీ సూచించినట్లు చెప్పారు.  వీలైతే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సర్వే చేపట్టాలని ప్రధానికి కేసీఆర్ విన్నవించినట్లు తెలిపారు.  హైదరాబాద్‌లో తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి సామరస్యంగా మెలగాలని వినోద్ అన్నారు.

సంతృప్తికరంగా సమావేశం

ప్రధానితో  సంతృప్తికరంగా సమావేశం జరిగినట్లు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌ రెడ్డి చెప్పారు.  విద్యుత్ సమస్య పరిష్కారానికి ప్రధాని హామీ ఇచ్చారన్నారు.  బయ్యారం ఉక్కు కర్మాగారం, హార్టికల్చర్ యూనివర్శిటీ, ఎన్టీపీసీ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు.  తెలంగాణలో సోలార్ అభివృద్ధిని ప్రధాని ప్రోత్సహిస్తామన్నారని  జితేం

0 comments:

Post a Comment