పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ మరోసారి వెండితెరపై జోడీ కట్టబోతున్నారు.షారూఖ్‌ఖాన్, ఐశ్వర్యరాయ్ కలిసి గతంలో మోహబ్బతే దేవదాస్ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
వివరాల్లోకి వెళితే...వివాహానంతరం సినిమాలకు పూర్తిగా దూరంగా వుంటున్న ఐశ్వర్యరాయ్ హిందీ చిత్రసీమలో పునరాగమనం చేస్తూ జాజ్‌బా అనే చిత్రంలో నటించబోతుంది.
ఇదిలావుండగా ఆమె మరో చిత్రానికి అంగీకరించినట్లు తెలిసింది. గత ఏడాది చెన్నె ఎక్స్‌ప్రెస్ లాంటి భారీ చిత్రాన్ని అందించిన దర్శకుడు రోహిత్‌శెట్టి షారూఖ్‌ఖాన్ కథానాయకుడిగా హమ్ చిత్ర రీమేక్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కథానాయికగా ఐశ్వర్యరాయ్‌ను ఎంపికచేశారు. ఈ చిత్ర స్క్రిప్ట్ పట్ల ఐశ్వర్యరాయ్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. 12 ఏళ్ల విరామం తర్వాత షారూఖ్, ఐశ్వర్య కలిసి నటిస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

0 comments:
Post a Comment