రెజీనా కథానాయికగా నటించిన
తమిళ చిత్రం నిర్ణయం. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో కె.జోత్స్నరాణి, యం.లక్ష్మి
తెలుగులో అందిస్తున్నారు. రాణా విక్రమ్ కథానాయకుడు. శరవణన్ దర్శకుడు.
సెల్వగణేష్ సంగీతం అందించిన ఈ చిత్ర గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.
నిర్మాత అశోక్‌కుమార్ ఆడియో సీడీలను విడుదల చేశారు. తొలి ప్రతిని దర్శకుడు వి.సాగర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ పాటలు, ప్రచార చిత్రాలు బాగున్నాయి. పబ్లిసిటీ బాగా చేస్తే ఓపెనింగ్స్ బాగుంటాయి. పెద్ద సినిమాలు అప్పడప్పుడు వస్తున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలదే హవా అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ఓ పెద్దింటి అమ్మాయి ఓ పేదింటి యువకుడు ప్రేమించుకుంటారు. వారి పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. చక్కని సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వగణేష్ చక్కటి సంగీతం అందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది అన్నారు. ఈ కార్యక్రమంలో హేమ, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment