Sunday, 21 September 2014

సలీమ్ రీమేక్‌లో వెంకటేష్........

వెంకటేష్ నటించిన చాల రీమేక్ సినిమాలు సంచలన విజయాలు సాధించాయి ఇటీవలే మలయాళ రీమేక్ దృశ్యంతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం హిందీ చిత్రం ఓ మైగాడ్ ఆధారంగా తెరకెక్కిస్తున్న గోపాల గోపాల చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన మరో రీమేక్ చిత్రానికి పచ్చజెండా ఊపారు. తమిళంలో విజయ్‌ఆంథోని హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సలీమ్ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఇందులో వెంకటేష్ కథానాయకుడిగా నటించబోతున్నట్లుగా సమాచారం. తమిళంలో ఎన్.వి.కుమార్ దర్శకత్వం వహించిన సలీమ్ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

0 comments:

Post a Comment