అక్కినేని జయంతి సందర్భంగా మనం చిత్ర శతదినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఇదే వేదికపై నాగచైతన్య
నటించిన ఒక లైలా కోసం చిత్ర ఆడియో విజయోత్సవాన్ని జరిపారు. అక్కినేని
పేరుమీద యు.ఎస్‌లో విడుదలైన పోస్టల్ స్టాంప్‌ను అక్కినేని వెంకట్,
నాగార్జున, నాగ సుశీల, సుశాంత్‌లు సంయుక్తంగా విడుదల చేశారు.
అనంతరం నాగార్జున మాట్లాడుతూ నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, పండిట్ రవిశంకర్‌ల తరువాత ఆ ఘనత సాధించిన ఐదవ వ్యక్తి నాన్నగారు కావడం మనకెంతో గర్వకారణం. దీనికి సహకరించిన యు.ఎస్ పోస్టల్ వారికి, అక్కినేని ఫౌండేషన్ అమెరికా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సారి అమెరికా వెళ్లినప్పుడు ఈ స్టాంప్‌లను ఉపయోగించి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కొన్ని ఉత్తరాలు రాస్తాను. నాన్నగారికి కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రాలంటే ఇష్టం.
మనం ప్లాన్ చేసి తీసిన సినిమా కాదు. అది ఆయన సంకల్పం. సినీ చరిత్రలో ఏ నటుడు కూడా చివరి క్షణాల వరకు నటిస్తూ చనిపోలేదు. నాన్నగారు తన చివరి క్షణం వరకూ నటిస్తూనే మనకు దూరమయ్యారు. మనం ఆయన మనకిచ్చిన తీపిగుర్తు. నాన్నగారి ఒక లైలా కోసం.. పాట ఎంత హిట్టయిందో అదే పేరుతో వస్తున్న సినిమా కూడా అంతే పెద్ద హిట్టవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమల, నాగచైతన్య, అఖిల్, పూజా హెగ్డే, అలీ తదితరులు పాల్గొన్నారు.

0 comments:
Post a Comment